Chamkeela Angeelesi: సోషల్ మీడియా.. ఇండస్ట్రీనీ షేక్ చేస్తున్న చమ్కీల అంగీలేసి’ సింగర్ ఎవరో తెలిస్తే…!

Nani and Keerthy Suresh in Dasara Movie

చాలా విచిత్రమైన వాయిస్ ఇప్పుడు తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు.. నాని (Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన ‘దసరా’ (Dasara Movie) చిత్రంలో ‘చమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) పాట పాడిన సింగర్ దీక్షిత అలియాస్ ధీ (Dheekshitha alias Dhee). వాస్తవానికి ఆమేం కొత్త గాయని కాదు. సూపర్ డూపర్ హిట్స్ సాంగ్స్ పాడిన తమిళ గాయని. ఆ పాటలేంటో తెలిస్తే అవి పాడింది ధీ (Dhee)నా? అని ఆశ్చర్యపోతారు. సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ‘ఆకాశం నీ హద్దు రా’ లో కాటుక కనులే సాంగ్ పాడింది కూడా ధీ (Dhee)నే.

Singer Dhee

ఇక అలాగే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను పొందిన రౌడీ బేబీ సాంగ్ కూడా ధీ (Dhee) గళం నుంచి జాలువారిందే కావడం విశేషం. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ (Santhosh Narayan) కుమార్తెనే ఈ ధీ (Dhee). ఆమె పాడిన పాటలన్నీ బాగా క్లిక్ అయ్యాయి. ఆమె 14 సంవత్సరాల వయస్సు నుంచే పాడటం ప్రారంభించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ గాయని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో తన మొదటి పాప్ ఆల్బమ్‌ను రూపొందించింది. ఇక అక్కడి నుంచి ఆమె పాడిన ప్రతి పాట వైరల్‌గా మారింది.

Nani in Dasara Movie

దసరా మూవీ (Dasara Movie)కి ధీ (Dhee) తండ్రి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆమె తన తండ్రి స్వరపరచిన ఎన్నో పాటలను పాడింది. తెలంగాణ (Telangana) యాసలో ఇంతటి కష్టమైన, టఫ్ పాట పాడినందుకు ఈ తమిళ గాయని పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. ఆమెను చూస్తే చాలా పాష్‌గా అనిపిస్తోంది. అలాంటి ధీ (Dhee).. ఒక తెలంగాణ యాసతో ఉన్న పాటను పాడటం విశేషం. ఈ పాటను కాసర్ల శ్యామ్ స్వచ్ఛమైన తెలంగాణ యాసలో రాయగా, రామ్ మిరియాల (Ram Miriyala) పాడారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికీ యూట్యూబ్‌లో దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆమె (Dhee) వైపే చూస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!