“హైపర్ ఆది గురించి అలా చెప్పడం కూడా నాకిష్టం లేదు”

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్‌లో అదిరే అభి ఒకరు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసినా రాని గుర్తింపు ఈ షోతో వచ్చింది. చాలా కాలం పాటు జబర్దస్త్‌లో అభి టీమ్ లీడర్‌గా అలరించాడు. అయితే ఎందుకోగానీ అభి ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత మా టీవీలో కొన్ని స్కిట్స్ చేసి గాయబ్ అయ్యాడు. అప్పటి నుంచి అభి ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు.

తాజాగా అదిరే అభి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను జబర్దస్త్ చేస్తున్ సమయంలో హైపర్ ఆది.. తానొక షార్ట్ ఫిలిం చేస్తున్నానని.. అది చూడాలంటూ ఫేస్‌బుక్‌లో ఒక మెసేజ్ పెట్టాడని తెలిపాడు. తనకు టైం దొరికినప్పుడు అది చూశానని.. బాగుందనిపించి.. ఒకసారి వచ్చి తనను కలవమంటూ రిప్లై ఇచ్చానని అభి తెలిపాడు.

తనను కలిసి  కొన్ని జోక్స్ షేర్ చేశాడని.. అవి కూడా బాగున్నాయని అభి తెలిపాడు. ఆ తరువాత తనను రెగ్యులర్‌గా కలుస్తూ స్కిట్స్‌ కోసం కొన్ని సలహాలిచ్చేవాడన్నారు. నెమ్మదిగా కొన్ని జోక్స్ రాసుకుని తీసుకురమ్మని చెప్పానన్నారు. అలా తన టీంలోకి ఎంటరయ్యాడన్నారు. అలా మెల్లగా ఆది ఎదిగాడని.. తనను వెనక్కి లాగేయాలని కానీ తొక్కేయాలనే ఆలోచన కానీ తనకు లేదన్నారు. తన వల్లే ఆది ఈ స్టేజ్ లో ఉన్నాడు అని చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదని అభి చెప్పుకొచ్చాడు.