అనసూయ చిన్న పిల్లా.. పక్కకు పంపడానికి: రష్మి సంచలనం!

అనసూయ చిన్న పిల్లా.. పక్కకు పంపడానికి: రష్మి సంచలనం!

అనసూయ యాంకరింగ్‌ను వదిలేసి పూర్తిగా నటనపై దృష్టి సారించింది. యాంకరింగ్‌లో ఉన్నన్ని రోజులు అనసూయ ఒక ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పైగా జబర్దస్త్ ఆమెకు చాలా మంచి గుర్తింపును ఇచ్చింది. ఇవాళ అనసూయ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం.. జబర్దస్తే. ఇదిలా ఉండగా యాంకర్ రష్మి తాజాగా తన 36వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అనసూయ మీద చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్‌కి అనసూయ స్థానంలో రష్మి వచ్చింది. అయితే అనసూయ స్థానంలో రష్మిని ప్రేక్షకులు అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో ఆమెను దారుణంగా విమర్శించారు. దీనిపై తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ ఘాటుగా స్పందించింది. తనకు సంబంధంలేని విషయంలో తనను ట్రోల్ చేశారని.. తనకు ఏం జరుగుతోందో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయానని తెలిపింది. అనసూయ ప్లేస్‌ను తాను ఆక్రమించుకోవడమేంటి? లాగేసుకున్నానంటూ రుబాబుగా సమాధానమిచ్చింది.

అనసూయ చిన్న పిల్లా.. పక్కకు పంపడానికి: రష్మి సంచలనం!

అనసూయ ఏమైనా చిన్న పిల్లా ఆమెను పక్కకు పంపించి తాను జబర్దస్త్‌కి రావడానికని ప్రశ్నించింది. మొత్తానికి ఇన్నాళ్లకు అనసూయపై తన అక్కసునంతా రష్మి వెళ్లగక్కిందని నెటిజన్లు అంటున్నారు. అప్పట్లో అనసూయ, రష్మిలకు ఒకరంటే ఒకరికి పడేది కాదని బాగా ప్రచారం నడిచింది. అలాంటి సమయంలో వాళ్లిద్దరూ కలిసి ఉన్న పిక్స్ పెట్టి.. తమ మధ్య విభేదాలేవీ లేవన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు రష్మి మాటలను చూస్తే విభేదాలు ఓ రేంజ్‌లో ఉన్నాయని అర్థమవుతోంది.