గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో పవన్‌ చేసిన పనికి పోసాని మండిపడ్డారట..

గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో పవన్‌ చేసిన పనికి పోసాని మండిపడ్డారట.. 

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‌లో పవన్ కల్యాణ్‌తో జరిగిన ఓ ఘటనను నటుడు పోసాని కృష్ణ మురళి వివరించారు. ఈ సినిమా సమయంలో తన భార్యకు స్టార్ హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగిందని.. అయినా తాను గబ్బర్ సింగ్ షూటింగ్‌కు వెళ్లానన్నారు. షూటింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కానీ పవన్ రాలేదన్నారు. తాను రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ టైమ్ ఇచ్చానని పోసాని తెలిపారు.

9 గంటల వరకూ కూడా పవన్ రాలేదన్నారు. దీంతో 9 గంటలకు తాను వెళ్లిపోయానని పోసాని తెలిపారు. తాను ఏ సినిమా కోసమైనా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ సమయం కేటాయిస్తానని.. ఆ తరువాత మాత్రం ఉండబోనన్నారు. అత్యవసరమైతే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ ఉంటానన్నారు. గబ్బర్ సింగ్ కోసం కూడా అలాగే సమయం ఇచ్చానని పోసాని తెలిపారు. రాత్రి 9 అయినా పవన్ రాకపోవడంతో తాను ఇంటికి వెళ్లిపోయానన్నారు.

తాను వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో పవన్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. తామేమైనా పిచ్చోళ్లమా షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అని పవన్ తనపై ఫైర్ అయ్యానని తెలిపారు. దీంతో తాను కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ‘‘ఏయ్ పవన్ కల్యాణ్ ఆపు.. పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. నీకు ఇష్టమైతే వెళ్లిపోతావా? నాకు పెళ్లాం బిడ్డలున్నారు. నీకు టైమ్ ఇచ్చాను. ఎందుకు రావు నువ్వు? ఏం పిచ్చెక్కిందా? నా భార్యకు ఆపరేషన్ అయిందని నీకు చెప్పలేదా? నీకేమైనా డౌటుంటే నా ఇంటికి రా’’ అని చెప్పి ఫోన్ పెట్టేశా’’ అని పోసాని తెలిపారు.