పుష్పలో కేశవ పాత్రకు ముందు ఆ హీరోనే అనుకున్నాం: సుకుమార్

పుష్పలో కేశవ పాత్రకు ముందు ఆ హీరోనే అనుకున్నాం: సుకుమార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి సీక్వెల్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్ర తర్వాత బీభత్సమైన పేరొచ్చిన పాత్ర కేశవ. సినిమా మొత్తం బన్నీని అంటిపెట్టుకుని ఉంటాడు. ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. తాజాగా సుక్కు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

సుహాస్ హీరోగా అర్జున్ వై.కె. రూపొందించిన చిత్రం ‘ప్రసన్నవదనం’ ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుక్కు ఇంట్రస్టింగ్ విషయాన్ని తెలిపారు. సుహాస్ అంటే తనకు చాలా ఇష్టమని సుకుమార్ తెలిపారు. అల్లు అర్జున్‌కు కూడా సుహాస్ అంటే ఇష్టమేనని తెలిపారు.

సుహాస్ ఎదుగుదల అంటే ఇష్టమని.. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్ కేశవగా ముందు సుహాస్‌నే అనుకున్నామని.. అయితే అప్పటికే హీరోగా చేస్తున్నాడు కాబట్టి కేశవ రోల్‌కి ఎంపిక చేయడం సరికాదనిపించి ఊరుకున్నామని సుకుమార్ తెలిపారు. ఇక హీరోల్లో నాని నటనంటే తనకు నాకు బాగా ఇష్టమని.. సుహాస్‌ తనకుఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడన్నారు. సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడని అనాలేమో అన్నారు.

Google News