ఆ నటుడు ఏమయ్యాడు? రియల్ లైఫ్‌లోనూ రీల్ లైఫ్‌ను తలపించే ట్విస్ట్‌లు..

ఆ నటుడు ఏమయ్యాడు? రియల్ లైఫ్‌లోనూ రీల్ లైఫ్‌ను తలపించే ట్విస్ట్‌లు..

ప్రముఖ నటుడు గురు చరణ్ సింగ్ దాదాపు నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. సదరు నటుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 50 ఏళ్ల గురు చరణ్ సింగ్ అసలు ఏమయ్యారు? గురు చరణ్ సింగ్‌కు హిందీలో ‘తారక్ మెహతా కా ఉల్తా చష్మా’ అనే టీవీ సీరియల్‪‌ ద్వారా విపరీతమైన గుర్తింపు వచ్చింది.

నాలుగు రోజుల క్రితం గురు చరణ్ సింగ్ ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడు. ముంబై వెళ్లాలని వెళ్లిన ఆయన అక్కడికి చేరుకోలేదు సరికదా ఇంటికి కూడా తిరిగి రాలేదు. ఫో‌న్ కోసం ట్రై చేసినా కూడా అవడం లేదట. కనీసం ఎలాంటి సమాచారమూ లేదట. దీంతో ఆందోళన చెందిన ఆయన తండ్రి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. 

పోనీ గురు చరణ్ సింగ్ మానసిక పరిస్థితి సరి లేదా? అంటే అలాంటిదేమీ లేదు. పర్ఫెక్ట్‌గానే ఉన్నారు. కుమారుడి కోసం తాము కూడా ఎంతగానో వెదికామని.. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదని ఫిర్యాదులో గురు చరణ్ సింగ్ తండ్రి పేర్కొన్నారు. తండ్రి అనారోగ్య సమస్యల కారణంగానే టీవీ షో నుంచి సైతం గురు చరణ్ తప్పుకున్నాడు. కుటుంబం కోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న గురుచరణ్ అనూహ్యంగా మిస్ అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తానికి ఆయన రియల్ లైఫ్‌లోనూ రీల్ లైఫ్‌ను తలపించే ట్విస్టులు కనిపిస్తున్నాయి.

Google News