పుష్ప 2 రెమ్యూరేషన్‌తో రికార్డ్ క్రియేట్ చేయనున్న అల్లు అర్జున్

పుష్ప 2 రెమ్యూరేషన్‌తో రికార్డ్ క్రియేట్ చేయనున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ కాస్త ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ‘పుష్ప’ సినిమా బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్‌ను తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమాకు తొలుత రివ్యూలన్నీ అంతో ఇంతో నెగిటివ్‌గానే వచ్చాయి. కానీ సినిమా మాత్రం కేవలం పబ్లిక్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఒక్క దెబ్బకు బన్నీ రేంజ్ మారిపోవడంతో పుష్ప 2 కోసం రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేశాడని టాక్. పుష్పకు ముందు తెలుగు, మలయాళంలో మాత్రమే అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్ప 2కు కూడా బీభత్సంగా హైప్ ఏర్పడింది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు సైతం భారీగా పెంచేశాడట. 

ఇటీవలే ఈ సినిమా ఓటీటీ డీల్ ఓ రేంజ్‌లో పూర్తి చేసుకుంది. దాదాపు రూ.275 కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే బన్నీ తన రెమ్యూనరేషన్‌ని కూడా అమాంతం పెంచేశాడట. పుష్ప కోసం బన్నీ రూ.100 కోట్లు తీసుకుంటే.. పుష్ప 2 కోసం రూ.150 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్. ఇదే కనుక నిజమైతే దేశంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

Google News