ఆమెకు నా ఫుల్ సపోర్ట్: రేణు దేశాయ్ సంచలన పోస్ట్

ఆమెకు నా ఫుల్ సపోర్ట్: రేణు దేశాయ్ సంచలన పోస్ట్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో విజయం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా కొందరు ఎవరికి నచ్చిన వారికి వారు మద్దతు ఇస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువ లోక్‌సభ సీట్లను కైవసం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఈ స్థానం నుంచి ఎంఐఎం తరుఫున అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు.

 అసదుద్దీన్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ మాధవీ లతను బరిలోకి దింపింది. మాధవీ లత చాలా యాక్టివ్‌గా జనాల్లోకి వెళుతున్నారు. ఒకవైపు ప్రచారం.. మరోవైపు ప్రెస్‌మీట్లతో ఎలక్షన్ హీట్‌ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం మాధవీ లతకు రేణు దేశాయ్ సపోర్టుగా నిలిచారు. ఈ మేరకు ఇన్‌స్టాలో రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు. చాలా కాలం తర్వాత రాజకీయాల్లో ఒక బలమైన మహిళను చూశానని.. ఆమెకు తాను సపోర్టుగా నిలుస్తున్నట్టు తెలిపారు. తాను నిజాయితీగా ఫీలయ్యే ఈ పోస్ట్ పెట్టానని.. డబ్బు తీసుకుని కాదని మాధవీ లత వెల్లడించారు.