పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ల పెళ్లి వార్తలు సర్వసాధారణం. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి న్యూసే ఓ హీరోయిన్ గురించి నడుస్తోంది. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్ అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా? తమిళ బ్యూటీ మేఘా ఆకాష్. గతంలోనూ ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి రూమర్స్ వినవచ్చాయి. 

‘లై’ అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి మేఘా ఆకాష్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా కొన్ని సినిమాలు చేసేసింది. గత ఏడాది అయితే ఎకంగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ అయితే ఒకరకంగా మాంచి జోష్ మీదుంది. ఈ తరుణంలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్

మేఘా ఆకాష్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడిని వివాహం చేసుకోనుందని ఇప్పటికే టాక్ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ ప్రచారాన్ని చాలా లైట్ తీసుకుంది. దీంతో అంతా మరిచిపోయారు. ఇప్పుడు మరోసారి పెళ్లి వార్తలు వినవస్తున్నాయి. దీనికి పెళ్లికూతురు లుక్‌లో మేఘా ఆకాష్ దర్శనమివ్వడమే కారణం. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు మేఘా ఆకాష్ పోస్ట్ చేయడంతో ఆమె పెళ్లేనని అంతా అనుకుంటున్నారు.

Google News