వామ్మో శ్రుతిహాసన్.. ఎంతమందికి బ్రేకప్ చెబుతుంది?

వామ్మో శ్రుతిహాసన్.. ఎంతమందికి బ్రేకప్ చెబుతుంది?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. ప్రేమలో పడటమూ కొత్త కాదు.. లేవడమూ కొత్త కాదు. ఇప్పటికి చాలా సార్లు బ్రేకప్ చెప్పసింది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ ‘శాంతాను హజారికా’తో శ్రుతి హాసన్‌ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు తాజాగా బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినవచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలంటూ శ్రుతి హాసన్ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే కొంత కాలంగా శ్రుతి హాసన్ శాంతాను హజారికాకు మధ్య విభేదాలు వచ్చినట్టు సోషల్ మీడియా టాక్. ఈ జంట తరచుగా పలు పార్టీల్లోనూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లోనూ కనిపించేది.

వామ్మో శ్రుతిహాసన్.. ఎంతమందికి బ్రేకప్ చెబుతుంది?

ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు సైతం ఇచ్చే వారు కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఎవరి మానాన వారు తిరుగుతున్నారు. వీరిద్దరూ కలిసి జంటగా కనిపించిన పాపాన పోవడం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ నెల రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తున్న విషయం ఏంటంటే.. ఇద్దరూ సోషల్ మీడియా అకౌంట్‌లలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇది బ్రేక్ వార్తల వెనుక అసలు కథ.