హాట్ టాపిక్‌గా అల్లు అరవింద్ కారు.. దీని ధర మరింత హాట్..

హాట్ టాపిక్‌గా అల్లు అరవింద్ కారు.. దీని ధర మరింత హాట్..

సినీ ప్రముఖులు ఏం చేసినా హాట్ టాపిక్కే అవుతూ ఉంటుంది. ప్రతి దానిలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏది కొన్ని దానిలో లగ్జరీ కనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు వాచ్ దగ్గర నుంచి ఏం కొన్నా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా కొత్త కారు కొన్నారు. బీఎండబ్ల్యూ ఐ 7 బ్రాండ్‌ను కొన్నారు. ఈ బ్రాండ్ కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. 

ఇది ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. ఈ కారు కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ఈ కారు ధర రెండున్నర కోట్లపై మాటేనని సమాచారం. ఇప్పుడు ఈ కారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తీశారు. ఈ బ్యానర్‌పై వచ్చిన సినిమాల్లో పసివాడి ప్రాణం నుంచి అల వైకుంఠపురములో వరకూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి.

హాట్ టాపిక్‌గా అల్లు అరవింద్ కారు.. దీని ధర మరింత హాట్..

ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 22వ సినిమాతో పాటు పలు సినిమాలను ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారానే నిర్మితం కానుంది. వీటితో పాటు కొన్ని ఇతర భాషా చిత్రాలను సైతం అల్లు అరవింద్ డబ్ చేయిస్తున్నారు. ఒకవైపు నిర్మాతగానూ.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్‌గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇక ప్రస్తుతం ఆయన తనయుడు బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.