వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించిన మహేష్..

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపార ప్రకటనలు.. ఇంకోవైపు బిజినెస్‌ ద్వారా బీభత్సంగా సంపాదించేస్తున్నాడు. ఇప్పటి వరకూ సినిమాకు 70-80 కోట్లు తీసుకున్న మహేష్.. రాజమౌళితో సినిమాకు రూ.100 కోట్ల పైనే తీసుకుంటున్నాడని టాక్. ఇక వ్యాపార ప్రకటనలు చెప్పనక్కర్లేదు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ అనే తేడా లేకుండా ఎడా పెడా యాడ్స్ చేస్తున్నాడు.

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించిన మహేష్..

ఈ లెక్కన చూస్తే మహేష్ ఏడాది సంపాదన రూ.100 కోట్ల పైమాటేనని టాక్. ముఖ్యంగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్.. మంచి బిజినెస్ మైండ్ అని అంటారు. ఆమెకు వ్యాపార మెళుకువలు బాగా తెలుసట. అందుకే ఆమె మహేష్ సంపాదన మొత్తాన్ని వ్యాపారాల వైపు మళ్లిస్తూ అటు కూడా విపరీతంగా సంపాదించేస్తోంది. ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించిన మహేష్..

అలాగే ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో ఒక మల్టీఫ్లెక్స్ నడుపుతున్నారు. ఇది మంచి సక్సెస్ సాధించింది. దీంతో దీనిని మరో నగరానికి విస్తరించాలని మహేష్‌తో పాటు ఆయన పార్టనర్ సునీల్ నారంగ్ భావించారు. ఈ క్రమంలోనే బెంగుళూరులో ఏఎంబీ సినిమాస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఏఎంబీ సినిమాస్ భాగస్వామి సునీల్ నారంగ్ కుటుంబంతో సహా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.