ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఒక్కసారిగా అలా కనిపించడంతో నెటిజన్లు షాక్..

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఒక్కసారిగా అలా కనిపించడంతో నెటిజన్లు షాక్..

జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ముంబై వెళ్లాడు. వార్ 2 షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి ఓ డిన్నర్ పార్టీలో పాల్గొన్నాడు. అక్కడ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నెట్టింట లక్ష్మీ ప్రణతి పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహర్, హృతిక్ రోషన్ సందడి చేశారు. 

అంతమంది స్టార్స్ నడుమ లక్ష్మీ ప్రణతి హైలైట్ అవుతున్నారు. అసలు పెద్దగా బయటకు వచ్చేందుకే ఇష్టపడని లక్ష్మీ ప్రణతి స్లీవ్ లెస్ టాప్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇలాంటి డ్రెస్‌లో ఎప్పుడూ ఆమె బయట కనిపించింది లేదు. దీంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎప్పుడూ నిండైన బట్టల్లో కనిపించే స్టార్ వైఫ్ స్లీవ్ లెస్ టాప్ ధరించి దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. ముంబైలో లక్ష్మీప్రణతి చాలా గ్లామరస్‌గా కనిపించారు. 

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబోలో ‘ దేవర ‘ చేస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. దీంతో ఎన్టీఆర్ వార్ 2 చిత్ర షూటింగ్‌లో సైతం పాల్గొంటున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసమే భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ముంబైలోనే ఎన్టీఆర్ మకాం వేశాడు.

Google News