‘కల్కి’పై కాపీ కామెంట్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే..

'కల్కి'పై కాపీ కామెంట్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్‌ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి విడుదలయ్యే వరకూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2989 ఏడీ’ మూవీలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ తారాగణం నటిస్తోంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది.

 కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లను చూసి ప్రేక్షకులు కాపీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘డ్యూన్‌’ను కాపీ కొట్టారంటూ నెసోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా దీనిపై నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చారు.

 కల్కిని కొందరు హాలీవుడ్‌ సినిమా డ్యూన్‌తో పోలుస్తున్నారని.. కానీ దానిలో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు.  సినిమాలో ఉన్న ఇసుకను చూసి బహుశా అలా పోల్చుతూ ఉండవచ్చని నాగ్ అశ్విన్ అన్నారు. నిజానికి ఇప్పటికే చాలాసార్లు ‘కల్కి’ చిత్రాన్ని ఇలా వేరే హాలీవుడ్‌ చిత్రాలతో పోల్చారని.. కానీ తమ సినిమాను ఏ సినిమా నుంచి కాపీ కొట్టలేదన్నారు. ఇందులో ఏ సినిమా రెఫరెన్స్‌లు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయం సినిమా విడుదల తర్వాత అందరికీ క్లారిటీ వస్తుందని నాగ్ అశ్విన్ తెలిపారు.