ఐపీఎల్‌లో ప్రభాస్.. అందరి ఫోకస్ ఆయనపైనే.. కారణమేంటంటే..

ఐపీఎల్‌లో ప్రభాస్.. అందరి ఫోకస్ ఆయనపైనే.. కారణమేంటంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే  ప్రమోషన్స్‌ను కాస్త వినూత్నంగా నిర్వహించి ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కల్కి గెటప్‌లో ఐపీఎల్‌లో ప్రత్యక్ష్యమయ్యాడు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. 

మొత్తానికి ఈ గెటప్‌లో హాజరై అటు ఐపీఎల్‌ను ఎంజాయ్ చేయడమే కాకుండా సినిమాకు కావల్సిన దానికంటే ఎక్కువగానే ప్రయోషన్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్రభాస్ తొలిసారిగా ఇలాంటి కథను ఎంచుకోవడంతో మరింత ఆసక్తి పెరిగింది. హీరో కథలో భాగంగా కాలంలో ప్రయాణిస్తాడని టాక్. ముఖ్యంగా భవిష్యత్ లో ప్రపంచం ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ గొప్పగా తెరకెక్కించారట.

నిజానికి ఈ సినిమా మే 9నే విడుదల కావాల్సి ఉంది. కానీ జూన్ 27కి వాయిదా పడింది. ఫ్యూచర్ వరల్డ్ మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని నాగ్ అశ్విన్ ధీమాగా చెబుతున్నాడు. చిత్ర యూనిట్ మొత్తం కల్కి విజయంపై ధీమాతో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఐపీఎల్ వేదికగా కల్కి చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో అందరి అటెన్షన్ సినిమా పైకి మళ్లింది.