ఒక్క లైక్‌తో మళ్లీ షురూ..

ఒక్క లైక్‌తో మళ్లీ షురూ..

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌కు కొదువేముంటుంది? అయితే ఇవి ఎప్పుడూ రాంగ్ అని కొట్టిపడేయలేం. కొన్ని సార్లు నిజమవుతుంటాయి కూడా. ఇండస్ట్రీ మొత్తాన్ని పక్కనబెట్టి అక్కినేని హీరో నాగచైతన్య విషయం చూద్దాం. చైతు గురించి చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

చైతు, శోభితా ఏమైనా తక్కువ తిన్నారా? ఈ రూమర్స్‌కు బలం చేకూర్చేలా ఇద్దరూ ఓ సారి లండన్ వెకేషన్ అని.. మరోసారి రెస్టారెంట్‌లో జంటగా కనిపించారు. అయితే ఈ జంట మాత్రం అవి ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపడేస్తూ వస్తోంది. వీరిద్దరూ మాత్రం స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫోటోని షేర్ చేశారు.

ఆ ఫోటోకి శోభిత లైక్‌ కొట్టింది. ఇక అంతే గత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న రూమర్స్ తిరిగి ఊపిరి పోసుకున్నాయి. ఆ ఫోటో తీసింది శోభితానే అని.. వారిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లారంటే వారి అనుమానాలన్నీ సోషల్ మీడియాలో రుద్దేశారు. కొందరు మాత్రం లైక్ కొట్టడం కూడా తప్పేనా? దానికే ఇంత రచ్చ చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన లవ్‌లో ఉన్నట్టు కాదంటూ హితవు పలుకుతున్నారు.