వామ్మో.. సమంత వాచ్ ధర అంతా?

వామ్మో.. సమంత వాచ్ ధర అంతా?

స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతానికైతే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. మయో సైటిస్ వ్యాధికి చికిత్సకు వెళ్లడానికి ముందు ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్2లో నటించింది. ఇప్పుడు అది విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సమంత సినిమాలకు విరామం ప్రకటించినా కూడా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి నిత్యం టచ్‌లో ఉంటోంది.

ఇక సామ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె బ్రాండెడ్ దుస్తుల్లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. అయితే నెటిజన్ల దృష్టి మాత్రం ఆమె పెట్టుకున్న రిస్ట్ వాచ్ పైకి వెళ్లింది. వజ్రాలు పొదిగిన లగ్జరీ వాచ్ అది. చూసిన వెంటనే ఆగుతారా? ఆ వాచ్ ధర ఎంతో నెట్‌లో సెర్చ్ చేసి మరీ తెలుసుకుని షాక్‌కు గుర్యారు. ఎందుకంటే ఆ వాచ్ ధర అక్షరాలా రూ.70 లక్షలట.

వామ్మో.. సమంత వాచ్ ధర అంతా?

సమంత ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన వాచ్ ధరించింది. ఆ వాచ్ తన దుస్తులకు తగ్గట్టుగా పెట్టుకుంది. వైట్ లక్కర్ జాకెట్‌తో పాటు మినీ స్కర్ట్ ధరించిన సామ్.. ఆ డ్రెస్ కి తగ్గట్టుడైమండ్ స్టడెడ్ సెర్పెంటిస్పీగా వాచ్ ధరించింది. ఈ వాచ్ డయల్ సిల్వర్ ఒపలైన్, డైమండ్లతో పొదగబడింది. ఈ వాచ్‌ని గతంలో కూడా సామ్ ధరించినట్టు నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి సామ్ అయితే ప్రస్తుతానికి వెబ్ సిరీస్‌తో సరిపెట్టేయనుంది.

అభిమానుల ఎదురుచూపులు

విడాకుల తర్వాత సమంత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది, ఇందులో ఆటో ఇమ్యూన్ డిసీజ్ మైయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారణ కావడం వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. మళ్ళీ ఎప్పుడు సినిమాల్లో నటిస్తుందా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. త్వరలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన స్పై థ్రిల్లర్ సిరీస్ “సిటాడెల్: ఇండియా”లో సమంత కనిపించనుంది.

మహేష్, అల్లు అర్జున్ ని దాటేసిన సమంత

మహేష్, అల్లు అర్జున్ ని దాటేసిన సమంత

ఫాస్ట్ గా 200 మిలియన్స్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో సమంత ఊ అంటావా ఊ ఊ అంటావా మొదటి ప్లేస్ ఉంది. కాగా మహేష్ బాబు కుర్చీ మడతబెట్టి సాంగ్ రెండో ప్లేస్ లో, అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ మూడో ప్లేస్ లో ఉంది. ఈ విషయం లో మహేష్, బన్నీని దాటించి మరీ సమంత టాప్ ప్లేస్ లో నిలిచింది.

అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో సమంత? :

అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో సమంత? :

అల్లు అర్జున్, అట్లీ మూవీలో సమంత నటించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీ వంటి ప్రముఖ దర్శకుడితో కలిసి పనిచేయడం తన కం బ్యాక్ కి మంచి గుర్తింపు రానున్నట్టు సమంత భావిస్తోందట.

Google News