ప్రభాస్ పెళ్లిపై విశాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ప్రభాస్ పెళ్లిపై విశాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎన్నో సార్లు ప్రభాస్ అప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్ తోటి హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కనేశారు. ప్రఱభాస్ మాత్రం పెళ్లి ఊసెత్తితేనే సైలెంట్ అయిపోతున్నాడు. 40 ఏళ్లు దాటినా కూడా పెళ్లి ఆలోచనే చేయడం లేదు. ఇక ప్రభాస్ పెళ్లిని ఇప్పటికే కొందరు ప్రమోషన్సన్ కోసం వాడేశారు.

ఎందుకంటే ప్రభాస్ పేరే ఒక సెన్సేషన్. ఆయన పెళ్లి అయితే మరింత సెన్సేషన్. ప్రభాస్ పెళ్లిని వాడితే రీచ్ ఓ రేంజ్‌లో ఉంటుందని తెగ వాడేస్తున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా ఇదే పని చేశాడు. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం ఈ నెల 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రత్నం తెలుగు ప్రమోషన్స్ కోసం విశాల్ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ లోకల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాల్‌ని మీడియా పెళ్లెప్పుడని అడిగింది.

విశాల్ ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చి నైస్‌గా ఎస్కేప్ అయ్యాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ పెళ్లనే లేదు. ఇదే విషయాన్ని విశాల్‌ని అడగ్గా.. ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పాడు. ఆయన పెళ్లి చేసుకున్నాక తన మొదటి పెళ్లి కార్డు ప్రభాస్ దంపతులకు ఇస్తానని చెప్పాడు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి టాపిక్ లేవనెత్తడంతో రత్నం సినిమా ఓ రేంజ్‌లో పబ్లిసిటీ అవుతోంది.

Google News