ప్రియుడి గురించి ఆ వార్తలు తెలిసి బ్రేకప్ చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్

ప్రియుడి గురించి ఆ వార్తలు తెలిసి బ్రేకప్ చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో శాశ్వత ప్రేమలు, పెళ్లిళ్లు ఉండవు. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని ప్రేమలు మాత్రమే సక్సెస్ అయి పెళ్లి పీటలెక్కుతాయి. ఇక పెళ్లి తర్వాత కూడా అంతా కలిసుంటారని చెప్పలేం. అలా విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందంటూ వార్తలు వస్తున్నాయి. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు నిధి అగర్వాల్. నార్త్ ఇండియాకు చెందిన నిధి సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా తర్వాత నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ అమ్మడికి కావల్సినంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించింది కానీ వాటిలో కెరీర్‌కు పనికొచ్చే సినిమాలు ఒక్కటీ లేవు.

ప్రియుడి గురించి ఆ వార్తలు తెలిసి బ్రేకప్ చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్

ఇక ఆ తరువాత టాలీవుడ్‌ను వీడి ఇతర ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన నటించింది కానీ ఏ ఒక్కటీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక యువ నటుడితో ప్రేమాయణం నడిపిందట. అతను ఏ ఇండస్ట్రీకి చెందిన వాడో తెలియలేదు కానీ అమ్మడు మాత్రం తాజాగా బ్రేకప్ చెప్పేసిందట. దీనికి కారణం.. అతడి రాసలీలన్నీ నిధి చెవిన పడటమేనని టాక్. దీంతో బ్రేకప్ చెప్పేసి కెరీర్‌పై ఫోకస్ పెట్టిందట.