13 ఏళ్లుగా ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలోనే పెళ్లట.. ఆమె ప్రియుడు ఎవరో తెలిస్తే..

13 ఏళ్లుగా ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలోనే పెళ్లట.. ఆమె ప్రియుడు ఎవరో తెలిస్తే..

సినీ ఇండస్ట్రీలో ప్రేమంటే కొన్ని సార్లు నెలలు.. మహా అయితే ఒకటో రెండో సంవత్సరాలు అంతకు మించి ఉండటం చాలా అరుదు. అయితే కొందరు నటీమణులు మాత్రం తమ స్నేహితులను కొన్నేళ్ల పాటు ప్రేమించి కెరీర్‌లో మంచి సక్సెస్‌లను చవిచూసిన మీదట వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి వారి ప్రేమలు ఎవర్‌గ్రీన్. దాదాపు ఢోకా ఉండదనే చెప్పాలి.

ఇక ఇదు ఎన్న మాయం అనే కోలీవుడ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు కానీ కీర్తికి అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. ఇక టాలీవుడ్‌లో మహానటి చిత్రంలో నటించడంతో అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం ఈ చిత్రానికి కీర్తి సురేష్ అందుకుంది.

13 ఏళ్లుగా ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలోనే పెళ్లట.. ఆమె ప్రియుడు ఎవరో తెలిస్తే..

ఇక కీర్తి ప్రేమ, పెళ్లి వార్తలు తరచూ నెట్టింట వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన వార్త మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. 31 ఏళ్ల కీర్తి సురేష్ త్వరలోనే తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతోందట. ఈ ముద్దుగుమ్మ ప్రేమ ఈ నాటిది కాదు. 13 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉందట. ఇక ఆమె ప్రియుడు ఎవరంటారా? ఆమె స్నేహితుడేనట. అయితే అతను ఏం చేస్తాడు? ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.