ఐదే సినిమాలు.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి!

ఐదే సినిమాలు.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి!

దివ్య ఖోస్లా కుమార్‌.. ఈమె పేరు వినగానే ఎక్కడో విన్నామని కూడా అనిపించదు. ఆమె టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో వచ్చిన ‘లవ్‌టుడే’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్, అమితాబ్, బాబీ డియోల్ వంటి వారి సరసన హీరోయిన్‌గా నటించింది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దివ్య ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనుకుంది.

అయితే ఐదంటే ఐదు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో’ సినిమా సెట్‌లో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో ప్రేమలో పడింది. దీంతో దివ్య దశ తిరిగింది. 2005లో భూషణ్‌ను దివ్య ఖోస్లా వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న దివ్య 2016లో రీ ఎంట్రీ ఇచ్చింది. దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలు చేసింది.

ఐదే సినిమాలు.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి!

ప్రొడ్యూసర్‌గా 8 సినిమాలను తెరకెక్కించింది.  ఇక లేటెస్ట్‌గా యానిమల్ సినిమాకు నిర్మాతగానూ చేసింది. ఇప్పుడు దివ్య ఖోస్లా భర్త భూషణ్ కుమార్ తాజాగా రూ. 10,000 కోట్లతో 175వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన దివ్య ఎక్కడ? వేల కోట్లకు అధిపతిగా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్న దివ్య ఎక్కడ? అదృష్టం ఆమెకు మామూలుగా కలిసి రాలేదు.