మెస్మరైజ్ చేస్తున్న మహేష్ లుక్.. రాజమౌళి చిత్రం కోసమేనట..

మెస్మరైజ్ చేస్తున్న మహేష్ లుక్.. రాజమౌళి చిత్రం కోసమేనట..

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుకు ఎస్ఎస్ఎంబీ 29 పేరిట తెగ వైరల్ అవుతోంది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్ దుబాయ్‌కు వెళ్లి.. ఇటీవలే అక్కడ పనులు ముగించుకుని వారంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

మహేష్, రాజమౌళి తదితరులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మునుపెన్నడూ కనిపించని లుక్‌లో మహేష్ ఆకర్షిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ లేటెస్ట్ లుక్ రాజమౌళి సినిమాకు సంబంధించిందేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మెస్మరైజ్ చేస్తున్న మహేష్ లుక్.. రాజమౌళి చిత్రం కోసమేనట..

మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్‌ను ఎవరూ టచ్ చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈ సినిమాకు ‘మహరాజ్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఈసినిమాకు సంబంధించి 8 లుక్స్ ట్రై చేసిన రాజమౌళి.. చివరకు మహేష్ వీడియోలో కనిపించిన లుక్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

Google News