సోషల్ మీడియాలో నభా నటేశ్, ప్రియదర్శి రచ్చ.. రచ్చ!

సోషల్ మీడియాలో నభా నటేశ్, ప్రియదర్శి రచ్చ.. రచ్చ!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో నభా నటేశ్ టాలీవుడ్ మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుంది. అంతా బాగుంటే ఈ ముద్దుగుమ్మ రేంజ్ ఎక్కడో ఉండేది. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చిత్ర పరిశ్రమకు కొంత కాలం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ ప్రమాదం నుంచి కోలుకుని నభా నటేష్ తిరిగి సినిమాల్లో అవకాశం దక్కించుకుంటోంది.

సోషల్ మీడియాలోనూ నభా నటేష్ చాలా యాక్టివ్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ప్రియదర్శి ఇద్దరూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ గొడవ పెట్టుకున్నారు. ఇదంతా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. నభా నటేశ్ సరదాగా ట్విటర్‌లో ‘‘హాయ్‌ డార్లింగ్స్‌ ఎలా ఉన్నారు!!’’ అంటూ ప్రభాస్ వాయిస్‌తో క్రియేట్ చేసిన ఓ పోస్ట్ పెట్టింది. ఇది నెటిజన్లను బాగా ఆకర్షించింది.

నభా నటేశ్ పోస్ట్‌పై ప్రముఖ నటుడు ప్రియదర్శి స్పందించాడు. వావ్‌ సూపర్‌ డార్లింగ్‌.. కిర్రాక్‌ ఉన్నావని రిప్లై ఇచ్చాడు. తనని డార్లింగ్ అని పిలవడాన్ని నభా నటేశ్ సహించలేకపోయింది. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం లైంగిక వేధింపులతో సమానమని రాసి ఉన్న ఇమేజ్‌ను షేర్ చేసి ఒక పోస్ట్ కూడా పెట్టింది. ‘‘మిస్టర్‌. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త’’ అని పోస్ట్‌లో పేర్కొంది.పరిచయం లేని వ్యక్తులనే విషయం తనకు తెలియదని.. మీరైతే డార్లింగ్ అనొచ్చు.. మేమంటే సెక్షన్సా? లైట్ తీసుకో డార్లింగ్.. హద్దు దాటి ప్రవర్తించకంటూ తిరిగి ప్రియదర్శి కామెంట్ పెట్టాడు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసమని టాక్.