సరికొత్త హెయిర్ కట్‌, గడ్డంతో వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. ఫ్యాన్స్ ఫిదా..

సరికొత్త హెయిర్ కట్‌, గడ్డంతో వింటేజ్ లుక్‌లో ప్రభాస్.. ఫ్యాన్స్ ఫిదా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే రేంజ్ హిట్ కొట్టడం కోసం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అఅశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ స్టార్స్.. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్ వంటి వారంతా నటిస్తున్నారు.

పద్మావతి పాత్రలో దీపికా కనిపించనుంది. అమితాబ్ వచ్చేసి అశ్వత్థామగా కనిపిస్తారట. ఈ చిత్రం మే 9నే విడుదల కావాల్సి ఉంది కానీ ఎన్నికల కారణంగా వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. కొన్ని సినిమాల విషయంలో ఏళ్లకు ఏళ్లను వెచ్చించేశాడు.  కాబట్టి ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ ఏడాది కల్కితో పాటు మరో సినిమా కూడా విడుదల చేస్తారట.

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. సెట్స్‌లో తాజాగా ప్రభాస్ కూడా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సరికొత్త హెయిర్ కట్‌, గడ్డంతో వింటేజ్ లుక్‌లో  ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీనిలో ప్రభాస్ మిర్చి సినిమా ప్రభాస్‌ని తలపిస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.