కమిట్‌మెంట్ ఇచ్చినా కొందరికి అవకాశాలు రావట్లేదు.. హిమజ సంచలనం

కమిట్‌మెంట్ ఇచ్చినా కొందరికి అవకాశాలు రావట్లేదు.. హిమజ సంచలనం

సుమారు పదేళ్ల క్రితం సీరియల్స్‌లో అడుగు పెట్టి.. ఆపై 2013లో రామ్‌ నటించిన శివమ్‌ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అప్పటి నుంచి చాలా సినిమాల్లో నటించింది. కానీ అమ్మడికి ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. ఆ తరువాత బిగ్‌బాస్‌లో ఛాన్స్ రావడంతో అమ్మడి దశ తిరిగింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హిమజ. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావాలా వద్దా అన్నట్టుగానే వస్తున్నాయి. 

తాజాగా హిమజ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనిలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు పెద్దగా రావడం లేదు.. దీనికి కారణమేంటనుకుంటున్నారు అన్న ప్రశ్నకు హిమజ సమాధానం ఇచ్చింది. తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్‌డ్‌గా ఉండేవారని.. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయని అనుకోవడం తప్పని చెప్పింది.

కమిట్‌మెంట్ ఇచ్చినా కొందరికి అవకాశాలు రావట్లేదు.. హిమజ సంచలనం

కొందరికి  కమిట్‌మెంట్ ఇచ్చినా కూడా అవకాశాలు రావడం లేదని.. అంటే దానర్థం అవకాశాలు అందుకున్న వారంతా కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లు కాదని వెల్లడించింది. అవకాశాలన్నీ ముంబై నుంచి వచ్చిన వాళ్లకేనని.. వాళ్లలో ఏం నచ్చిందో తెలియదని వెల్లడించింది. కొందరు తెలుగమ్మాయిలు హీరోయిన్ అయితేనే చేస్తానంటారని.. తొలుత ఏదో ఒక అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ బాగుంటుందని తెలిపింది. తనైతే హీరోయిన్ కావాలనుకోలేదని.. ఏ అవకాశం వచ్చినా చేస్తానని చెప్పింది. ప్రస్తుతానికి తాను హ్యాపీ అని హిమజ తెలిపింది.