అయ్యో పాపం.. స్నేహ కష్టాలు అన్నీ ఇన్నీ కావే!!

అయ్యో పాపం.. స్నేహ కష్టాలు అన్నీ ఇన్నీ కావే!!

ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ స్నేహ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుని రాణించింది. గ్లామర్‌కు ఆమడ దూరంలో ఉన్నా కూడా స్నేహకు మంచి ఆదరణే లభించింది. హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి అదిరిపోయే హిట్స్ కొట్టింది.

తమిళంలో స్నేహ నటుడు ప్రసన్నతో కలిసి అచ్చముందు అచ్చముందు అనే సినిమాలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప. అయితే తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేమని తెలిపింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకెళుతున్నావనే ప్రశ్నలు రాకూడదని.. అసలు మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలే రావని తెలిపింది.

Sneha, Prasanna Kumar

భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలని స్నేహ తెలిపింది. భార్యని భర్త ప్రశ్నించడానికి ముందే మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఏ టైంకి వస్తామో చెబితే సమస్యలుండవని చెప్పింది. తను కూడా పెళ్లైన కొత్తలో పొజెసివ్‌గా ఉండేదాన్నని తెలిపింది. అయితే తన భర్త గతంలో ఒకమ్మాయిని ప్రేమించాడని.. వారికి బ్రేకప్ అయ్యిందని వెల్లడించింది. బ్రేకప్ జరగకుంటే తనకు ప్రసన్న భర్తగా దొరికేవాడు కాదని తెలిపింది. ఆ సమయంలో తను వేరొక సమస్యతో బాధపడ్డానని.. ఏడాదంతా కష్టంగా నడిచిందని.. మానసిన ఒత్తికి లోనయ్యానని వెల్లడించింది.