మళ్లీ ఆ ముగ్గురా?.. బిగ్‌బాస్ 8 గురించి షాకింగ్ అప్‌డేట్..

మళ్లీ ఆ ముగ్గురా?.. బిగ్‌బాస్ 8 గురించి షాకింగ్ అప్‌డేట్.. 

బిగ్‌బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపరీతమైన ప్రేక్షకాదరణ సాధించుకుని రేటింగ్స్‌లో దూసుకెళ్లింది. ఇక ఈ వేడి ప్రేక్షకుల్లో తగ్గకముందే బిగ్‌బాస్ సీజన్ 8ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ కోసం పరిశీలన చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కొందరిని సంప్రదించారని సమాచారం.

అయితే బిగ్‌బాస్ 8 గురించి ఒక షాకింగ్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..ఈ సీజన్‌లో పాత సీజన్‌కి సంబంధించిన ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయనున్నారట. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం ముగ్గురు కంటెస్టెంట్స్. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే.. శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్.

మళ్లీ ఆ ముగ్గురా?.. బిగ్‌బాస్ 8 గురించి షాకింగ్ అప్‌డేట్.. 

సీజన్‌ 7లో ఈ ముగ్గురూ టాప్ 3 స్థానాలను దక్కించుకున్నారు. స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ గొడవలతో ఈ సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పుడు ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ ముగ్గురు తిరిగి 8వ సీజన్‌లోనూ సందడి చేయనున్నారని టాక్. ప్రస్తుతం అమర్‌దీప్ అయితే ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది. మరి వీళ్లు తిరిగి సీజన్ 8లో కనిపిస్తారో లేదో చూడాలి.