శ్రీరామనవమి సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..

శ్రీరామనవమి సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. చేతిలో మూడు సినిమాలు ఉన్నా కూడా ఎన్నికల నేపథ్యంలో ఆయన షూటింగ్‌కు సమయం వెచ్చించలేకపోతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను పవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు. దీనికి కారణం ఇది పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కావడమే.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సినిమాలు, పోస్టర్లు, ఇతర అప్‌డేట్స్ అన్నీ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమా షూటింగ్‌ను మూడేళ్ల క్రితమే పవన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది ఒక అడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతోంది. దీంతో సినిమాను క్రమక్రమంగా పవన్ ఫ్యాన్సన్ మరచిపోతున్నారు. అయితే సినిమా గ్రాఫిక్ వర్క్ జరుగుతోందని.. త్వరలోనే అప్‌డేట్స్ ఇస్తామని చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం తెలిపింది.

శ్రీరామనవమి సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..

ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్‌గా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్‌లో పవన్ కత్తి పట్టుకుని కనిపించాడు. కళ్లలో ఏదో పవర్ కనిపిస్తోంది. ఇక ఆ పోస్టర్ పై భాగంలో మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో అని రాయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. మొత్తానికి ఎలాంటి అప్‌డేట్ లేకుండా పవన్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది.