‘దేవర’కు కష్టాలు స్టార్ట్.. ఎవరూ ముందుకు రావట్లేదట..

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమా అంటే అంచనాలకు ఏం కొదువ ఉంటుంది. ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి కష్టాలు తాజాగా ప్రారంభమయ్యాయని టాక్ నడుస్తోంది. అసలు ఏంటా కష్టాలు? 

దేవర సినిమా తెలుగులో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనడం కోసం పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. వచ్చినా కూడా భారీ మొత్తంలో పెట్టడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ సాహసించడం లేదని టాక్ నడుస్తోంది. చిత్ర నిర్మాతలైతే ఈ సినిమా రైట్స్ కోసం రూ.120 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అంత పెద్ద మొత్తం వెచ్చిస్తే రేపు అటు ఇటైతే పరిస్థితేంటని డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారట.

బై మిస్టేక్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే ముందుగా దెబ్బ పడేది డిస్ట్రిబ్యూటర్లకే అందుకే ఎందుకొచ్చిన గొడవ అని వెనుకా ముందు ఆలోచిస్తున్నారట. అయితే దీనికి సంబంధించి మరో టాక్ కూడా నడుస్తోంది. కొరటాల శివకు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సినిమా రైట్స్‌ను వాళ్ల చేతే కొనిపించేందుకు కొరటాల ప్రయత్నాలు మొదలు పెట్టారట.