‘షీలా కీ జవానీ’ సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసిన సాయిపల్లవి.. ఫ్యాన్స్ ఫిదా

‘షీలా కీ జవానీ’ సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసిన సాయిపల్లవి.. ఫ్యాన్స్ ఫిదా

హీరోయిన్ సాయిపల్లవి నటనే కాదు.. డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది. ఆమె డ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తమిళ బ్యూటీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేతి వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేమి.. ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. 

ఒకవైపు సినిమాలు చేస్తూనే.. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇక సాయి పల్లవికి సంబంధించి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. అది ఇప్పటిది కాదు.. ఆ వీడియోలో తన స్నేహితులతో కలిసి సాయి పల్లవి ‘షీలా కీ జవానీ’ పాటకు స్టెప్పులు ఇరగదీసింది. వీడియో అయితే ఎప్పటిదో కాబట్టి పెద్దగా క్లారిటీ లేదు.

‘షీలా కీ జవానీ’ సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసిన సాయిపల్లవి.. ఫ్యాన్స్ ఫిదా

అయితేనేమి అమ్మడి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకు గానూ అమ్మడి రెమ్యూనరేషన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి సాయి పల్లవి రూ.50 కోట్లు తీసుకుంటోందని టాక్ నడుస్తోంది.