నాని, దేవరకొండ.. కల్కి నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

నాని, దేవరకొండ.. కల్కి నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే నిత్యం వార్తల్లో ఉంటూ వస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ పేరే వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నాని, దేవరకొండ.. కల్కి నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో మరికొందరు ప్రముఖ నటులు భాగం కానున్నారని సమాచారం. దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోల గురించి టాక్ నడుస్తోంది. టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారట.

కల్కి నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 

వివిధ భాషలకు చెందిన ప్రముఖ తారాగణాన్ని నాగ్ అశ్విన్ తీసుకుంటున్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ యాక్టర్స్‌ను తీసుకుంటే సినిమా ప్రమోషన్స్ చాలా తేలికగా జరుగుతాయి. ఇప్పుడు దర్శకులంతా చేస్తున్నది ఇదే. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే.. మహాభారతంతో ప్రారంభమై క్రీస్తుశకం 2898లో పూర్తవుతుంది. ఈ కథ మొత్తంగా 6 వేల ఏళ్ల వ్యవధిలో నడుస్తుంది.

Google News