రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం..: ఓపెన్ అయిన మాజీ మిస్ వరల్డ్

రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం..: ఓపెన్ అయిన మాజీ మిస్ వరల్డ్

రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వెల్లడించింది. బాలీవుడ్‌లో అవకాశాల మీద అవకాశాలు కొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. చెర్రీ డ్యాన్స్‌కు తానొక పెద్ద ఫ్యాన్ అని వెల్లడించింది. 

ఎప్పటి నుంచో తాను రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానని.. తన తదుపరి సినిమా పక్కాగా చెర్రీతోనే ఉండాలని కోరుకుంటున్నట్టు మానుషి చిల్లర్ తెలిపింది. ‘బ‌డే మియా ఛోటే మియా’ సినిమాలో తనకంటే 30 ఏళ్లు పెద్ద వాడైన అక్షయ్ కుమార్‌తో ఈ ముద్దుగుమ్మ జత కట్టింది. ఈ సందర్భంగా ఈ విషయమై మాట్లాడుతూ.. వయసులో పెద్ద వారైనా స్టార్ హీరోలతో నటిస్తానని తెలిపింది.

రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం..: ఓపెన్ అయిన మాజీ మిస్ వరల్డ్

స్టార్ హీరోలతో నటిస్తే ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వీలుంటుందని మానుషి చిల్లర్ వెల్లడించింది. అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ అని ఆయనతో వర్క్ చేయడాన్ని తానెంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. అక్షయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కొందరికే వస్తుందని తెలిపింది. తమ చిత్రాల్లో ఎవరిని తీసుకోవాలనే దర్శకుల నిర్ణయమని.. కాబట్టి దాని గురించి తాను ఆలోచించబోనని తెలిపింది.

Google News