Ahimsa 1st Day Collections: ‘అహింస’ మొదటి రోజు కలెక్షన్లు ఎంత దారుణంగా వచ్చాయో తెలిస్తే..

Ahimsa 1st Day Collections: 'అహింస’ మొదటి రోజు కలెక్షన్లు ఎంత దారుణంగా వచ్చాయో తెలిస్తే..

తెలుగు ఇండస్ట్రీకి ఎందరో నటీనటులను పరిచయం చేసిన దర్శకుల్లో తేజ(Director Teja) ఒకరు. ఆయన కెరీర్ తొలినాళ్లలో తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. చిత్రం, జయం, నువ్వు నేను వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక అదే పంథాను ఫాలో అయితే ఎవరు చూస్తారు? తేజ(Teja) విషయంలోనూ అదే జరిగింది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో కెరీర్ కాస్తా ఎండ్ అయ్యే స్థితికి చేరింది.

ఇక ఆ తరువాత చాలా కాలానికి తేజ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి స్టైల్ మార్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దగ్గుబాటి రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’(Nene Raju Nene Mantri) చిత్రం కమర్షియల్‌గా పెద్ద హిట్. ఇక తేజ(Teja) రూటు మార్చారు కాబట్టి తిరుగులేదు అనుకున్నాం కానీ మళ్లీ ఆయన మొదటికొచ్చారు. తాజాగా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తో తీసిన ‘అహింస’(Ahimsa) అనే చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా తొలి షోతోనే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. 

Ahimsa 1st Day Collections: 'అహింస’ మొదటి రోజు కలెక్షన్లు ఎంత దారుణంగా వచ్చాయో తెలిస్తే..

Ahimsa 1st Day Collections:

సినిమా విడుదలకు ముందు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమా సత్తాను తెలిపాయి. రొటీన్ సినిమా అని తేల్చేశాయి. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు చేసిన కామెంట్స్ కూడా సినిమాకు పెద్దగా సీన్ లేదని తేల్చేశాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు కనీసం 50 లక్షల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయిందట. ఇక షేర్ అయితే రూ.20 లక్షలు కూడా రావట్లేదట. సినిమాకు అయిన ఖర్చు రూ.4 కోట్లు. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోలేదు.

Google News