Kota Srinivasarao: మరోసారి నోటికి పనిజెప్పి పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారిన కోట శ్రీనివాసరావు

Kota Srinivasarao: మరోసారి నోటికి పనిజెప్పి పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారిన కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao).. టాలీవుడ్ గర్వించదగిన నటుల్లో ఆయన ఒకరు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన నటుడిగా అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఏ పాత్రైనా సరే అవలీలగా నటించగల దిట్ట. నటుడిగా ఆయన్ను వేలెత్తి చూపించేందుకు అవకాశమే లేదు కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆయన ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలకు గురి అవుతూ వస్తున్నారు. కోట చేసే కామెంట్స్ ఆయన విలువను తగ్గించేలా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై కామెంట్స్ చేసి ఆయన ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యారు. మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా రీసెంట్ గా ఒక చిన్న ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి కోటశ్రీనివాస రావు(Kota Srinivasarao) హాజరై రామారావు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అంతటితో ఆగితే బాగుండేది కానీ ఆయన ఆగరుగా.. పవన్ గురించి ఇదే ఈవెంట్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశఆరు.

Kota Srinivasarao: మరోసారి నోటికి పనిజెప్పి పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారిన కోట శ్రీనివాసరావు

ఎన్టీఆర్ మహానటుడు అని.. అప్పట్లో ఆయన ఎప్పుడూ.. ఎక్కడా కూడా తన రెమ్యూనరేషన్ గురించి బయట చెప్పుకోలేదన్నారు. కానీ ఈ మధ్య కొంతమంది రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నాను, 3 కోట్లు తీసుకుంటున్నాను అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని.. అది సరికాదని సూచించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని కోటశ్రీనివాస రావు (Kota Srinivasarao) ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. పవన్ తన రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొవడానికి ఒక కారణం ఉందని.. తెలిసి కూడా కోటా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Google News