Dil Raju: దిల్‌రాజు కామెంట్‌తో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవ!

Dil Raju Comments

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఏ విషయం అయినా సరే చాలా ఆచితూచి మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో అయితే అస్సలు వివాదం జోలికి పోడు.. ఒకవేళ అలాంటివాటికి సమాధానం చెప్పాల్సి వస్తే.. తిన్నగా ఏదో ఒకటి చెప్పి జారుకుంటాడు. ఎందుకో ఈసారి పొరపాటున కామెంట్స్ చేసేశాడు. ఆ కామెంట్స్.. ఒక స్టార్ హీరో అభిమానులకు చెవిలో అమృతం పోసినట్లుంటే.. మరో హీరో ఫ్యాన్స్‌కు మాత్రం కడుపులో మంట పెట్టినట్లుంది. దీంతో ఆ హీరోల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ కామెంట్స్ కాస్త తెలుగు రాష్ట్రాలను దాటి జాతీయ స్థాయికి వెళ్లిపోయాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా.. దిల్‌‌రాజ్‌ కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది.. ఇదో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

Vijay Ajith Fans

ఎందుకింత రచ్చ..?

వాస్తవానికి.. ఎప్పట్నుంచో కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరిలో ఏ ఒక్క హీరో సినిమా రిలీజ్ జరిగినా.. మరో హీరో ఫ్యాన్స్ తిట్ల వర్షం కురిపిస్తుంటారు. అలాంటిది.. దిల్‌రాజు ఏకంగా మీడియా ముందే.. ‘తమిళంలో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో’ అని అన్నాడు. ఈ ఒక్క కామెంట్‌తో తమిళనాట రచ్చ రచ్చ జరుగుతోంది. ఉప్పు-నిప్పులా ఇరువురి ఫ్యాన్స్ మధ్య.. మరింత మంట పెరిగేలా చేసిందీ కామెంట్.

ఇదేందయ్యా..!

సంక్రాంతికి ‘తనివు’ Thunivu సినిమాతో అజిత్ (Ajith).. ‘వారసుడు’ Varasudu సినిమాతో విజయ్ (Vijay) బరిలో ఉన్నారు. ‘వారసుడు’ సినిమాను దిల్‌రాజే నిర్మించాడు. దీంతో ఇప్పట్నుంచే మార్కెటింగ్, ఫ్రీ పబ్లిసిటీ షురూ చేశాడు. అజిత్ పెద్ద హీరో ఏమీ కాదు.. ‘వారసుడు’ కోసం చెన్నైకి వెళ్లి ఎక్కువ స్క్రీన్స్ అడుగుతానని కామెంట్స్ చేసేశాడు. ఇవే కాంట్రవర్సీకి దారితీశాయి. వాస్తవానికి చెన్నైలో మాత్రం 800 స్క్రీన్స్‌లో చెరో సగం ఇవ్వాలని బయ్యర్లు నిర్ణయించారు. ఇది సంతోషించదగ్గ విషయమే కానీ.. ఇంతలోనే దిల్‌రాజు మాత్రం నోరు జారాడు. దీంతో.. సమ ఉజ్జీల్లాంటి హీరోల్ని ఎక్కువ, తక్కువ చేసి మాట్లాడటమేంటి..? అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో అయితే మీమ్స్, ఓ రేంజ్‌లో కామెంట్లతో ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.

Thunivu Varasudu

జాగ్రత్త.. సుమీ!

దిల్‌రాజు తెలిసన్నారో తెలియకన్నారో.. తెలియట్లేదు కానీ తమిళనాట రచ్చ మాత్రం గట్టిగానే అవుతోంది. ఒకవేళ ఆయన.. చెన్నైకి నిజంగా వెళితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. సినిమా రిలీజ్‌ ఇంకా చాలా టైమ్‌ ఉండగానే ఇంత రచ్చ రేపిన దిల్‌రాజు.. ఇంకా మున్ముందు ఎన్నెన్ని గొడవలు పెడతాడో చూడాలి. Any Way.. Fans.. బీ కూల్.. ఎవరేం మాట్లాడితేం.. మీ అభిమానం మీ హీరోపై చాటుకోండి అంతే తప్ప.. వివాదాల జరిగి కొట్టుకునే పరిస్థితికి వెళ్లొద్దన్నదే పెద్దల సూచన. ఫ్యాన్స్‌తో ఇంత రచ్చ అవుతోందే.. ఇక హీరోలు నేరుగా దీనిపై రియాక్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే అభిమానులారా.. బీ కేర్‌ ఫుల్.

Google News