Mahesh Babu – Namrata: ఆ ఇద్దరి వల్లే మహేష్-నమ్రత మధ్య గొడవలు!

Mahesh Babu Namrata

అవును.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌ మహేష్ బాబు- నమ్రత (Mahesh Babu – Namrata) మధ్య గొడవలు జరుగుతాయంట. అది కూడా ఆ ఇద్దరి వల్లేనట.. ఈ విషయం స్వయంగా నమ్రతానే చెప్పిందండోయ్.. ఈ ఒక్కటే కాదు ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అది పెళ్లి దాకా ఎలా వెళ్లింది..? పెళ్లిపై మహేష్‌కు ఎలాంటి అభిప్రాయం ఉంది..? ఇలా అన్ని విషయాలు ఓ ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టింది నమ్రత. ఇక ఆలస్యమెందుకు.. ఆసక్తికర విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

మహేష్, నమ్రత మీడియాకు చాలా దూరంగా ఉంటారు. మహేష్ అయినా సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తారేమో కానీ.. నమ్రతా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి నమ్రత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్ని రోజులుగా ఏమేం చెప్పాలనుకుందో మొత్తం అన్ని విషయాలు పూసగుచ్చినట్లుగా చెప్పేసింది. మహేష్-నమ్రత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట మోడలింగ్ చేసిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత.. అప్పుడు మహేష్ కలిశాడు. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమ చిగురించి.. పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందని నమ్రత చెబుతోంది.

Mahesh Babu Namrata2

తనను మహేష్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన రోజును జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని.. జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పింది ఘట్టమనేని కోడలు. అంతేకాదు.. కాబోయే భార్య ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనేదానిపై మహేష్ బాబుకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పింది నమ్రత. అందుకే తాను సినిమాలకు దూరం అయ్యానని స్పష్టం చేసింది. పెళ్లయిన తర్వాత కూడా చాలా సినిమాలు ఆఫర్ వచ్చినా నటించలేదని తెలిపింది.

Mahesh Babu Namrata3

లవ్ మ్యారేజీ చేసుకున్నా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రావని చెప్పింది. ఒకవేళ గొడవలు వస్తే మాత్రం.. అవి పిల్లల విషయంలో మాత్రమేనని చెప్పింది. ఇందుకు కారణాలు కూడా తెలిపింది నమ్రత. పిల్లలు ఏం కావాలన్నా మహేష్‌నే అడుగుతారని.. ఆయన ఏదీ కాదనకుండా ‘ఎస్’ అనే చెబుతుంటారు కానీ తాను మాత్రం ‘నో’ చెబుతానని చెప్పిందామె. ఈ Yes, No కూడా సరదాగా జరిగే గొడవలు మాత్రమే అని తెలిపింది నమ్రత. ఇక చివరగా మహేష్ సినిమాల గురించి కూడా మాట్లాడిందామె. ఆయన నటించిన సినిమాలన్నింటిలో ‘పోకిరి’ (Pokiri) చాలా ఇష్టమని చెప్పింది.. ఈ సినిమాలోని ‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనేదే పాయింట్’ పంచ్ డైలాగే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది నమ్రత. చూశారుగా.. ఇవీ ఘట్టమనేని కోడలు మనసులోని మాటలు. ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలను తెగ షేర్ చేస్తున్నారు.

Google News