Manchu Manoj: మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..!

Manchu Manoj Second Marraige

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా..? ఇప్పటికే మంచు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో మునిగిపోయిందా..? పెళ్లి కోసమే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ పక్కనెట్టాడా..? అంటే తాజా పరిణామాలు, మనోజ్ స్వయంగా చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు..? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఈ తంతు ఎక్కడ జరగబోతోంది..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా మనోజ్ సినిమాకు దూరంగా ఉన్నాడు. ఆ మధ్య ‘అహం బ్రహ్మస్మి’ మూవీ పట్టాలెక్కిందని.. ఒకట్రెండు లుక్స్‌ కూడా లీకయ్యాయి. అయితే అప్పటికే ప్రణతిరెడ్డి (Pranathi Reddy)కి విడాకులిచ్చిన మూడ్‌లో ఉండటంతో అది కూడా ముందుకు సాగలేదని టాక్ నడిచింది. దీన్ని నుంచి తేరుకునేందుకు మొదట పెళ్లి చేసుకోవాలని.. ఆ తర్వాతే సినిమాలు మొదలుపెట్టాలని భావించాడట. ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులతో చర్చించగా.. ఇన్ని రోజులుగా దీనికోసమే ఎదురుచూశామని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రంగంలోకి దిగేశారట. డైరెక్టుగా.. మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడేసి మొత్తం సెట్ చేసేశారట. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కూడా చాలానే ఉందట.

Manchu Manoj Mounika

మనోజ్.. మౌనిక(Bhuma Mounika)ను పెళ్లి చేసుకోబోతున్నాడు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా పేరుగాంచిన భూమా నాగిరెడ్డి రెండో కుమార్తే మౌనిక. ఇంకా చెప్పాలంటే శోభా నాగిరెడ్డి కుమార్తె.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) సోదరి. ఇప్పటికే పలుమార్లు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. అంతేకాదు.. మనోజ్-మౌనిక ఇద్దరూ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు కూడా. ఆ రోజే రెండో పెళ్లి పక్కా అని తెలిసిపోయింది. అప్పట్లో వీరిద్దరి ఫొటోలు ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ కానీ.. భూమా ఫ్యామిలీ కానీ ఖండించలేదు. సో.. మౌనం అంగీకారమే కదా.

వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 2న మనోజ్-మౌనిక మూడు మూళ్లతో ఒక్కటి కాబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ శివారులోని మోహన్ బాబు ఫామ్‌హౌస్ లేదా.. తిరుపతిలోని విద్యానికేతన్ వేదికగా పెళ్లి జరగబోతోందని తెలియవచ్చింది. ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది గనుక.. హైదరాబాద్‌లో ప్లాన్ చేయాలని మంచు ఫ్యామిలీ భావిస్తోంది.. పైగా కర్నూలు నుంచి ఇక్కడికి రావడానికి కూడా సులభం అవుతుందని ఇరు కుటుంబాలు చర్చించుకుంటున్నారట.

Manchu Manoj Second Marraige 2

ఈ మధ్య చాలాసార్లు మీడియా కంట పడుతున్నాడు మనోజ్. త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు పదే పదే చెబుతున్నాడు. కొత్త జీవితం ఏంటో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా.. పరోక్షంగా రెండోపెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారన్న మాట. మనోజ్‌.. మౌనికకు ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి.. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఈ ఇద్దరి మనసులు కలవడంతో ఒక్కటవ్వబోతున్నారు. చాలా రోజులు ఇద్దరూ కలిసే చెన్నైలో ఉంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదైతేనేం.. మూడు మూళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు ఆల్ ది బెస్ట్.

Google News