Pawan Kalyan: దిల్‌రాజుకు ఓకే చెప్పి.. పవన్ తప్పు చేశాడా..?

Pawan Kalyan For Varasudu E

ప్రతి ఏడాది లాగే.. ఈ పొంగల్‌కు అదిరిపోయే టాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయ్. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలు మొదలుకుని చిన్న చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు తమిళ టాప్ హీరోలు అజిత్ ‘తనివు’, విజయ్ ‘వారసుడు’ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇప్పట్నుంచే మేకర్స్.. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో హడావుడి చేస్తుంటే.. మరికొందరు మాత్రం నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో తమ సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని సంపాదించుకుంటున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ‘వారసుడు’ సినిమాను బడా నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మించాడు. ఇప్పటికే దీనికి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. అయితే.. తాను నిర్మిస్తున్న తొలి తమిళ సినిమా కావడంతో దీన్ని పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. ఇందుకు ఏ మాత్రం చిన్న అవకాశం కూడా వదులుకోకుండా పక్కా ప్లాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో థియేటర్లను సిద్ధం చేసేశాడు. ఇంకా చాలానే కావాలని రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈ మధ్యనే దీనిపై మాట్లాడి దుమారం రేపగా.. అజిత్ గురించి మాట్లాడి స్టార్ హీరోల మధ్య చిచ్చు పెట్టినంత పనిచేశాడు.

Dil Raju Vijay

ఇక ‘వారసుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఒప్పించారట. పవన్‌కు అత్యంత సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద్వారా వెళ్లడంతో కాదనలేక.. ఒప్పేసుకున్నాడట పవన్. అప్పట్లో కల్యాణ్ నటించిన ‘బంగారం’ సినిమా సెట్‌లో విజయ్ సందడి చేశాడు. నాటి నుంచి పవన్-విజయ్ మధ్య స్నేహం కూడా ఉంది. ఇటు దిల్‌రాజుతోనూ పవన్‌కు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. సో.. పవన్ క్రేజ్‌ను రాజుగారు ఇలా వాడేసుకుంటున్నారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

అన్నీ సరే.. ఇదే సంక్రాంతికి మెగాస్టార్ చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కూడా వస్తోంది. మెగా సినిమాకు ‘వారసుడు’ (Varasudu) పోటీగా వస్తుంటే అక్కడికెళ్లి పవన్ సపోర్టు ఇవ్వడమేంటని.. మెగా కాంపౌండ్‌లో చర్చ జరుగుతోందట. ఇటు కొందరు మెగా ఫ్యాన్స్‌ కూడా అసంతృప్తితోనే ఉన్నారట. దిల్‌రాజు, త్రివిక్రమ్, విజయ్‌లను కాదనుకోలేక వెళ్తున్నారు సరే.. చిరు సంగతి కూడా ఆలోచించాలి కదా అని మరికొందరు వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే.. అన్నయ్య సినిమాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు.. ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వస్తే కలెక్షన్ల సునామీ కురుస్తుందని చెప్పుకుంటున్నారు. అబ్బే ఇవన్నీ రూమర్స్ అంతే.. పవన్‌ ఏ సినిమా ఈవెంట్లకు వెళ్లట్లేదు.. చిరును కాదని తెలిసి తెలిసి ఇలాంటి తప్పులు ఆయన చేయడని మెగా కాంపౌండ్‌కు దగ్గరివాళ్లు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో మరి.

ఏదైతేనేం.. అటు ఇటు కాకుండా దిల్‌రాజు లాక్ చేయడంతో మాటిచ్చాక పవన్‌ కూడా ఆలోచనలో పడ్డాడేమో. ఒకవేళ ఇదే నిజమైతే.. ఫంక్షన్‌కు వెళ్లి అన్ని ఇండస్ట్రీల హీరోలు నాకు ఫ్యామిలీనే..  అన్ని సినిమాలు చూసి ఆదరించండి అని సింపుల్‌గా ఒక మాటతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేయొచ్చు పవన్. లెట్స్ సీ.. ఏం జరుగుతుందో..!

Google News