NTR: కథ వినకుండానే ఎన్టీఆర్ మూవీకి బ్యూటీ గ్రీన్ సిగ్నల్!

Ntr Jr

టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ క్రేజీ హీరోల్లో ఎన్టీఆర్ NTR ఒకడు. యంగ్ టైగర్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘RRR’ తర్వాత.. జూనియర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే ఆ రేంజ్‌లోనే తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ లాంటి గుర్తుండిపోయే హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివతో చేస్తున్నాడు ఎన్టీఆర్. 9 భాషలతో ఫాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు ఎన్టీఆర్ లుక్స్ కూడా లీకయ్యాయి.

Jr Ntr Movie

‘ఎన్టీఆర్- 30’ వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ హై బ‌డ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, సినిమాటో గ్రాఫర్‌గా రత్నవేలు చేస్తున్నారు. ఈ మూవీ ప్రకటించి చాలా కాలమే అవుతున్నా.. వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని మేకర్స్ చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. హీరోయిన్ కోసం వెతికి వెతికి అలసిపోతున్నారట మేకర్స్. ఇప్పటికే.. బాలీవుడ్ బ్యూటీలు ఆలియా భట్, దీపికా పదుకుణె, కియారా అద్వానీలను సంప్రదించగా డేట్స్ ఖాళీలేవని చెప్పారట. కీర్తి సురేష్, పూజా హెగ్డే కూడా బిజీబిజీగా ఉండటంతో కుదరదని చెప్పేశారట.

Janhvi Kapoor

ఇక ఫైనల్‌గా బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను సంప్రదించారట మేకర్స్. ఎన్టీఆర్ పేరు చెప్పగానే కథ కూడా వినకుండానే ఓకే చెప్పేసిందట బ్యూటీ. అంతేకాదు రెమ్యునరేషన్ అంతివ్వాలి.. ఇంతివ్వాలని కూడా అడగలేదట. మేకర్స్ చెప్పినదానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిదంట. తెలుగు సినిమాల్లో నటించాలని చాలా రోజులుగా జాన్వీ తహతహలాడుతోంది. స్టార్ హీరోతో ఎంట్రీ ఇస్తే కాలం కలిసొస్తుందని వేచి చూస్తూ ఉన్నది. సరిగ్గా ఇదే సమయంలో జూనియర్ సరసన ఛాన్స్ రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా.. సంప్రదించగానే ఓకే అని చెప్పేసిందట.

ఈ ఆఫర్ మొదట జాన్వీ దగ్గరికే వెళ్లిందట. ఆమె నో చెప్పిన తర్వాతే మిగిలిన వారిని సంప్రదించాల్సి వచ్చిందట. అలా ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఫైనల్‌గా మళ్లీ స్ట్రాంగ్ రెకమెండేషన్‌తో మేకర్స్ వెళ్లి ఈ బ్యూటీని లాక్ చేసేశారట అని వార్తలూ వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అటు జాన్వీ అయినా రియాక్ట్ అవ్వాలి.. లేదా చిత్ర యూనిట్ అయినా అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాల్సిందే మరి.

Google News