Nandamuri Fans: నందమూరి ఫ్యాన్స్‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్.. అదిరిపోలా..!

Nandamuri Family

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి నాటికి.. నేటికీ ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈ ఫ్యామిలీలో వివాదాలు ఎన్ని ఉన్నా బయటికి రానివ్వకుండా సర్దుకుపోతుంటారు. ముఖ్యంగా.. నటసింహం బాలకృష్ణ అంటే.. జూనియర్ ఎన్టీఆర్ Jr NTR, కళ్యాణ్‌రామ్‌ Kalyan Ram కు పిచ్చి ప్రేమ. ఈ ముగ్గురు ఒకే స్టేజ్‌పై కనిపించినా.. వీరి గురించి ఏదైనా వార్త వచ్చినా ఇక నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల ఆనందానికి అవధులుండవ్. ఇప్పటికే పలుమార్లు స్టేజ్‌పై ఈ ముగ్గురు.. వీరితో పాటు ఫ్యామిలీ.. ఫ్యామిలీనే కనిపించింది.

ఇప్పటి వరకూ.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ జస్ట్ స్టేజ్‌పైన అలా కనిపించారంతే. అదే ఈ ముగ్గురు ఒకేసారి.. ఒకే చోట కూర్చుని ఫ్యామిలీ, రాజకీయాలు, సినిమాలు, ఫ్యాన్స్, వివాదాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది..? అబ్బా ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ.. అవును త్వరలో ఇదే జరగబోతోంది. ఈ ముగ్గురు కలవడానికి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో వేదిక కానుంది. రెండు మూడ్రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. కొందరు అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు.

Ntr Kalyan Ram

అన్ స్టాపబుల్ టాక్ షోను నిర్వాహకులు ఈ సీజన్‌లో డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఒక్కోసారి ఇద్దరు గెస్ట్‌లను తీసుకొచ్చి అలరిస్తున్నారు. ఇప్పటి వరకూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు- నారా లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి- సురేష్, ప్రభాస్- గోపీచంద్ ఇలా చాలా వరకు అంతా జంటగానే ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. అందుకే ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్‌ను ప్లాన్ చేశారట నిర్వాహకులు. సినిమా షూటింగ్‌కు ముందే అయితే తాను అందుబాటులో ఉంటానని.. ఈలోపు ప్లాన్ చేసుకోవాలని ఎన్టీఆర్ చెప్పాడట. అందుకే వీలైనంత త్వరలో షోకు ప్లానింగ్ చేస్తున్నారట నిర్వాహకులు. ఇదే జరిగితే.. చాలా చాలా విషయాలు బయటికొస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదేమో. సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుందో చూడాలి మరి.

Google News