Naga Chaitanya-Sobhita: అక్కినేని అఖిల్‌కు చై, శోభితల రిలేషన్‌పై ప్రశ్న.. ఆన్సర్‌ చూసి వదినమ్మా అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్స్

Akhil Akkineni

ప్రస్తుతం నాగ చైతన్య(Naga Chaitanya) గురించి రూమర్ ఒకటి తెగ ప్రచారంలో ఉంది.అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత(Naga Chaitanya – Sobhita) ధూళిపాళ్ల రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. వీరిద్దరూ ఎక్కడ చూసినా జంటగా కనిపించడమే దీనికి కారణం. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారో లేదో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేసేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. అక్కినేని అఖిల్(Akhil Akkineni) ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో నటించిన సినిమా ‘ఏజెంట్’(Agent). ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతోంది. దీనిలో భాగంగా తాజాగా అఖిల్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. దీనిలో భాగంగా ఒక రిపోర్టర్.. ఈ మధ్య కాలంలో మీ అన్నయ్య చైతు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవతున్నాడని.. ఎవరో అమ్మాయితో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడని.. మీ పరిస్థితేంటని అడిగాడు. 

Naga Chitanya - Sobhita Dhulipala

అయితే అఖిల్ మాత్రం చాలా ఇంటెలిజెంట్‌గా ఆన్సర్ చేసి ఈ వ్యవహారం నుంచి సైడ్ అయిపోయాడు. తన అన్న నాగచైతన్య ప్రస్తావన ఎక్కడా తీసుకు రాకుండా… రెండేళ్లుగా తాను తన బాడీ, జుట్టుని పెంచుకోవడానికి సరిపోతోందని.. ప్రస్తుతం తన ఫోకస్ అంత సినిమాలపైనే అని చెప్పి ఊరుకున్నాడు. చై మ్యాటర్ మాత్రం మాట్లాడలేదు. అయినా సరే సోషల్ మీడియా ఊరుకుంటుందా? రిపోర్టర్ ప్రశ్నను.. అఖిల్ సమాధానం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ దాని కింద వదినమ్మ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Google News