Ileana: ప్రెగ్నెంట్ అంటూ షాకిచ్చిన ఇలియానా.. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..

Ileana Pregnant

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది.. ఒక్క దెబ్బకు ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇల్లీ బేబీ(Ileana)కి శుభాకాంక్షలు చెప్పాలో.. మరేం చెప్పాలో తెలియక సతమవుతున్నారు. మంగళవారం ఉదయం తన ఇన్‌స్టాగ్రాంలో రెండు ఫోటోలను పోస్ట్ చేసిన ఇల్లీ బేబి.. ‘త్వరలో నిన్ను కలిసేందుకు వెయిట్ చేయకులేకున్న నా చిన్ని డార్లింగ్’ అంటూ ట్వీట్ చేసింది.

కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌ని ఏలిన ఈ నడుము సుందరి ఇప్పుడు అవకాశాల్లేక ఇబ్బంది పడుతోంది. లవ్ ఫెయిల్యూర్.. ఇటు కెరీర్ డల్.. మొత్తానికి ఇలియానా చాలా ఇబ్బందుల్లో ఉంది. రీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. బికినీ పిక్స్‌ని షేర్ చేసి ఫ్యాన్స్‌ను కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ(Ileana) తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది.

Ileana

సడెన్‌గా ప్రెగ్నెసీ అని ప్రకటించడంతో పెళ్లి లేకుండా తల్లి కావడమేంటని అవాక్కవుతున్నారు. పెళ్లి చేసుకుని ఆ మ్యాటర్‌ను బయటకు రానివ్వలేదా? లేదంటే పిల్లలంటే ఇష్టంతో సరోగసీ ద్వారా ఏమైనా ట్రై చేస్తోందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇల్లీ బేబి(Ileana)కి శుభాకాంక్షలు చెప్పేవారి కంటే ఈ ప్రెగ్నెన్సీపై ప్రశ్నలు సంధించే వారు ఎక్కవయ్యారు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావ్? పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? అంటూ ప్రశ్నలతో ఇలియానా(Ileana)ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నెటిజన్లు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!