Brahmanandam: తెలుగు రాని హీరోయిన్స్‌తో బ్రహ్మీ ఓ ఆట ఆడుకుంటారట..

Brahmanandam

బ్రహ్మానందం(Brahmanandam).. ఈయనను కొట్టేసే కమెడియన్ అయితే గత కొన్ని దశాబ్దాలుగా లేడనే చెప్పాలి. వయసు మీద పడుతున్నా కూడా ఆయనలోని కామెడీ యాంగిల్ తగ్గలేదు. ఇటీవలి కాలంలో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దానికి ఆయన రెమ్యూనరేషన్ కూడా కారణం కావచ్చు. అయితే బ్రహ్మీ(Brahmanandam) గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన తెలుగు భాష రాని హీరోయిన్స్‌తో ఒక ఆట ఆడుకుంటారట.

నిజానికి బ్రహ్మీ(Brahmanandam) ఏదైనా కార్యక్రమానికి హాజరైనా కూడా అక్కడ నవ్వులు పువ్వులు పూయిస్తారన్న విషయం తెలిసిందే. ఇక మరి సభలోనే అలా ఉంటే సెట్స్‌లో ఎలా ఉంటారు? బీభత్సమైన కామెడీ చేస్తారట. మరి ముఖ్యంగా సినిమాలో తన పార్ట్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా హీరో హీరోయిన్లతో చర్చిస్తూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ తెగ నవ్విస్తూ ఉంటారట . ఇక తెలుగు రాని హీరోయిన్స్ కైతే చుక్కలు చూపిస్తారట. తెలుగు రాకపోవడంతో వారు బ్రహ్మీ కామెడీని ఎంజాయ్ చేయలేరు కదా.. ఆ టైంలో వారిపై పంచులు పేల్చి మరీ నవ్విస్తారట.

మొత్తంగా సైలెంట్ ఉన్న హీరోయిన్స్‌ను కూడా వదలకుండా వారిని నవ్వించడానికి ట్రై చేస్తారని టాక్. సినిమా షూటింగ్‌లో బ్రహ్మీ(Brahmanandam) ఉన్నారంటే కామెడీకి లోటు ఉండదట. సినిమా ఎంత ట్రాజెడీది అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్ రాగానే ఫుల్లుగా నవ్విస్తారట. తాజాగా ఆయన నటించిన రంగమార్తాండ(Rangamarthanda) చిత్రం విడుదలైన విషయందే. ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాలో భావోద్వేగాల మిళితం అయినా కూడా కామెడీని చాలా చక్కగా పండించారు. రోల్ ఏదైనా సరే.. కామెడీని పండించగల దిట్ట బ్రహ్మానందం(Brahmanandam) అని ఆడియన్స్ తెగ కొనియాడుతున్నారు.

Google News