Janhvi Kapoor: జాన్వీకి టాలీవుడ్‌లో పెరిగిపోతున్న డిమాండ్.. చెర్రీకి కూడా ఆమే కావాలట..

Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor).. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతున్నా అమ్మడికి లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి(Sridevi) కూతురన్న ట్యాగ్ తప్ప సొంతంగా సంపాదించుకున్నదేమీ లేదు. ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఒక మంచి హిట్ అనేది అయితే పడింది లేదు. ధడక్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన అవకాశమైతే రాలేదు.

తాజాగా తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR).. జాన్వీ(Janhvi Kapoor)కి అవకాశం ఇచ్చాడు. అమ్మడికి ఓ స్టార్ హీరో సరసన నటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ అవకాశం కూడా కేవలం శ్రీదేవి కూతురు అన్న కారణంగానే వచ్చింది తప్ప సొంత ఇమేజ్‌తో వచ్చింది కాదు. అయితే దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) ఈ ముద్దుగుమ్మ పాత్రకు మంచి వెయిట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అమ్మడికి టాలీవుడ్‌ కలిసి రావొచ్చనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. త్వరలోనే అమ్మడు షూటింగ్‌లో పాల్గొనబోతోంది.

Ram Charan

ఎన్టీఆర్ 30లో జాన్వీ(Janhvi Kapoor) మిడిల్ క్లాస్ అమ్మాయిగా మెప్పించనుంది. తాజాగా అమ్మడికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో తన చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ(Janhvi Kapoor)ని తీసుకుందామంటూ పట్టుబడుతున్నాడని టాక్. దీంతో దర్శకుడు వెళ్లి జాన్వీతో మాట్లాడారని.. అంతా ఓకే అయిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. చెర్రీతో కూడా జాన్వీ నటించిందో అమ్మడికి ఇక కెరీర్ పరంగా తిరుగు లేనట్టే.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!