Trivikram: ఈ సారి త్రివిక్రమ్.. పవన్‌ను.. ఆ మెగా హీరోని కలిపేస్తారట..

Trivikram Srinivas

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ ప్రతి సినిమాలోనూ త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. డైరెక్ట్‌గా పని చేయరేమో కానీ ఆయన హస్తం మాత్రం పవన్ ప్రతి సినిమాలోనూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో పవన్ కోసం తెర వెనుక త్రివిక్రమ్ కష్టం చాలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. 

భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమాకు అయితే అన్నీ తానై చూసుకున్నారు. ఇక పవన్ తదుపరి చిత్రంపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. 

తాజాగా పవన్(Pawan Kalyan) – త్రిమిక్రమ్‌(Trivikram Srinivas)ల విషయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మరో సినిమాను పవన్ కోసం సెట్ చేస్తున్నారట త్రివిక్రమ్. వినోదాయ శితం రీమేక్ కోసం పవన్-సాయిధరమ్ తేజ్ ను కలిపిన త్రివిక్రమ్.. ఈసారి పవన్-వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)కాంబోని సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. వీరిద్దరి కాంబో కోసం త్రివిక్రమ్(Trivikram Srinivas) కథను సిద్ధం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహించరని సమాచారం. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

Pawan Kalyan, Sai Dharam Tej, Panja Vaishnav Tej

పవన్ కొత్త సినిమా కోసం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ( త్రివిక్రమ్ బ్యానర్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయట. పవన్-సుధీర్ వర్మ కాంబో గురించి న్యూస్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ న్యూస్ ఇప్పుడు నిజం కాబోతోందని టాక్. అయితే వచ్చే ఏడాది ఆయన అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పవన్ ప్రస్తుతానికి తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను కానిచ్చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో సుధీర్ వర్మ చిత్రం ఇప్పుడే పట్టాలెక్కుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!