Gunasekhar: గుణ శేఖర్‌ను ఒక ఆట ఆడుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్..

Gunasekhar

గుణశేఖర్(Gunasekhar).. ఫీల్ గుడ్ మూవీస్‌కి పెట్టింది పేరు. ఆయన హిస్టరీలో కొన్ని చిత్రాలు ఎవర్ గ్రీన్. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలకు ఓ రేంజ్‌లో ప్రజాదరణ లభించింది. ఇక ఎందుకోగానీ రుద్రమదేవి(Rudhramadevi) మూవీ తర్వాత గుణశేఖర్ చాలా గ్యాప్ తీసుకున్నారు. తాజాగా సమంత(Samantha) ప్రధాన పాత్రలో శాకుంతలం(Shaakuntalam) మూవీని రూపొందించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తొలి షోతోనే ఫ్లాప్ టాక్ వచ్చింది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అభిమానులుగుణశేఖర్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్‌ చేశారు. సోషల్ మీడియాలో ఆయనను ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు శాకుంతలం(Shaakuntalam) సినిమా ఫ్లాప్ ఏంటి? బాలయ్య అభిమానులు గుణశేఖర్‌ను ఆడుకోవడమేంటి? అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే. శాకుంతలంకి ముందు గుణశేఖర్(Gunasekhar) రుద్రమదేవి చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2015లో విడుదలైంది. అయితే తన సినిమాకు వినోద పన్ను మినహాయించాలని గుణశేఖర్ రెండు రాష్ట్రాల సీఎంలను కోరారు.

Advertisement

ఏపీలో అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆయన గుణశేఖర్(Gunasekhar) అభ్యర్థన విషయంలో స్పందించలేదు. కానీ ఆ తర్వాత 2017లో విడుదలైన బాలయ్య(Balakrishna) నటించిన గౌతమిపుత్ర శాతకర్ణికి మాత్రం చంద్రబాబు వినోద పన్ను మినహాయింపునిచ్చారు. పైగా బాలయ్య సినిమా నంది అవార్డును సొంతం చేసుకుంది. కానీ రుద్రమదేవి చిత్రానికి కనీసం జ్యూరీ అవార్డ్ కూడా దక్కలేదు. దీంతో గుణశేఖర్ ‘ప్రశ్నించడం తప్పా?’ అనే టైటిల్‌తో ఒక లేఖను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ లేఖను బాలయ్య అభిమానులు రీపోస్ట్ చేసి.. విమర్శలు, ప్రశ్నలు పక్కనబెట్టి కంటెంట్ మీద దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ‘శాకుంతలం’ను ఆస్కార్‌కు పంపిద్దామా? అంటూ గుణశేఖర్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.