Nagarjuna: నాగార్జున, లక్ష్మిల మధ్య విడాకులకు అసలు కారణం ఇదేనట..

Nagarjuna ex wife Lakshmi

అక్కినేని నాగార్జున(Nagarjuna).. అమల(Amala)ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు ఆయన దగ్గుబాటి రామానాయుడు కుమారుడు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఇది కూడా దాదాపు అందరికీ తెలిసిన విషయమే. నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే లక్ష్మి(Lakshmi)తో వివాహం జరిగింది. 1984లో ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాయి. నాగార్జున, లక్ష్మి దంపతులకు 1986లో నాగ చైతన్య జన్మించాడు. మరి నాగ్, లక్ష్మి ఎందుకు విడిపోయారు?

నాగ్(Nagarjuna), లక్ష్మి(Lakshmi)ల విడాకుల వ్యవహారంపై ఎన్నో రూమర్లు వచ్చాయి. తాజాగా వీరి విడాకుల వ్యవహారంపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. దానిలో నిజమెంతో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆ తర్వాత నాగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘విక్రమ్’ నాగార్జున(Nagarjuna) మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ ఫుల్ బిజీగా మారిపోయారు. దీంతో ఆయన ఫ్యామిలీకి టైమ్ పెద్దగా కేటాయించలేకపోయేవారని టాక్. ఇదే వీరిద్దరి మధ్య మనస్పర్థలకు తొలి కారణమట.

ఇక అక్కినేని నాగేశ్వరరావుకు అన్నపూర్ణ స్టూడియో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్లందరికీ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన గెస్ట్ హౌస్‌లో ఆశ్రయం దొరికేదట. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఈ హీరోయిన్లందరిలో నాగ్ చాలా సన్నిహితంగా ఉండేవారట. ఈ విషయం కాస్తా లక్ష్మికి తెలిసిందట. అప్పటికే అంతో ఇంతో ఉన్న మనస్పర్థలు కాస్తా ఈ వ్యవహారంతో ముదిరి పాకాన పడ్డాయట. ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకూ వెళ్లిందని కొత్తగా వినిపిస్తు్న్న టాక్.

Google News