Akhil Akkineni: అక్కినేని వారసత్వం బరువుగా మారిందంటూ అఖిల్ సంచలనం..

Akhil Akkineni sensational comments

సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ఏజెంట్’. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్(Akhil Akkineni) ఈ సినిమాలో హీరోగా నటించాడు. 2015లో అఖిల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ యంగ్ హీరోకు ఇప్పటి వరకూ హిట్ అనేది మాత్రం పడలేదు. ఏజెంట్(Agent) సినిమా అయినా తనకో మంచి హిట్ అందిస్తుందని ఆశతో ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌తో మూవీ టీం అంతా బిజీగా ఉంది.

ఏజెంట్ (Agent) సినిమా సక్సెస్ అయితే మాత్రం అఖిల్‌(Akhil Akkineni)కే ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది. తాజాగా అక్కినేని అఖిల్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో అక్కినేని వంశ వారసత్వంపై అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. తాను కేవలం అఖిల్‌(Akhil Akkineni)గా మాత్రమే సినిమాలు చేస్తున్నానని.. అక్కినేని వంశ వారసుడిగా కాదన్నాడు. అక్కినేని వారసత్వం అనేది తనకు ఓ బరువుగా మారిందని అఖిల్ పేర్కొన్నాడు. తాను ఓ నటుడిగా మెరుగుపడేందుకు యత్నిస్తున్నానన్నాడు.

Akhil Akkineni sensational comments

తనను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునేందుకే పని చేస్తున్నానని.. అలా ఓన్ చేసుకుంటే చాలా హ్యాపీ అని తెలిపాడు. అక్కినేని వారసుడిగా పని చేయాల్సి వస్తే.. ఒకే రకంగా పని చేయాల్సి ఉంటుందన్నాడు. తన కెరీర్ మొత్తం తెలుగు ప్రేక్షకులు తనను ఓన్ చేసుకునేందుకు పోరాడుతున్నానని.. వారసత్వం గురించి ఆలోచిస్తే ఆ ట్రాక్‌లోకి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు.

ఇక ఏజెంట్(Agent) సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా హిట్ అవడం ఖాయమని చిత్ర యూనిట్ అంతా నమ్ముతోంది.

Google News