Samantha: నిర్మాత చిట్టిబాబుకు సమంత దిమ్మతిరిగే కౌంటర్..

Samantha strong counter to producer Chitti Babu

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నటించిన ‘శాకుంతలం’(Shaakuntalam) సినిమా తొలి షోతోనే ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఒక పౌరాణిక సినిమాకు గ్రాఫిక్సే ప్రాణం. అలాంటి గ్రాఫిక్స్ పేలవంగా ఉండటమే ఈ సినిమా ఫ్లాఫ్‌కు మెయిన్ కారణమని ప్రేక్షకులు చెబుతున్నారు. సమంత కూడా శకుంతల పాత్రకు ఏమాత్రం సూట్ కాలేదని టాక్ నడుస్తోంది.

ఈ చిత్ర ఫెయిల్యూర్‌పై నిర్మాత చిట్టిబాబు(Producer Chitti Babu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్‌గా సమంత(Samantha) కెరీర్ అయిపోయిందని.. ఇక ఆమె స్టార్ డమ్ ఎప్పుడో కోల్పోందంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఆమె అనారోగ్యంపై కూడా చిట్టిబాబు(Chitti Babu) విమర్శలు చేశారు. మయోసైటిస్ వ్యాధి చాలా మందికి వస్తుందని.. అదేమీ ప్రాణాంతకం కాదని.. తన సినిమాలను హిట్ చేసుకోవడం కోసమే సమంత సింపతీ కోసం తన అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుంటోందని ఆరోపించారు.

తాజాగా చిట్టిబాబు(Chitti Babu) వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందించింది. తన ఫోన్‌లో టైప్ చేసిన గూగుల్ క్వెరీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ చిట్టి బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. చెవుల్లో జనాలకు జుట్టు ఎలా పెరుగుతుంది? అనే ప్రశ్నను గూగుల్‌లో కొట్టి వచ్చిన సమాధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెవుల్లో జుట్టు ఎలా పెరుగుతుందన్న ప్రశ్నకు గూగుల్ టెస్టో స్టిరాన్ పెరగడం వల్ల అంటూ గూగుల్ ఇచ్చిన సమాధాన్ని సామ్ షేర్ చేసింది. చెవుల్లో వెంట్రుకలు చిట్టిబాబుకు బాగా ఉంటాయి. పైగా సామ్‌ను విమర్శించారు కాబట్టి ఆమె కౌంటర్ ఆయనకేనని స్పష్టమవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!