Sunitha Husband: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Singer Sunitha husband Ram Veerapaneni

సింగర్ సునీత(Singer Sunitha) భర్త రామ్ వీరపనేని(Ram Veerapaneni)కి ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఫోన్ నంబర్ బ్లాక్ చేసినా కూడా మరో నంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట. ఈ క్రమంలోనే సునీత భర్త తనకు ప్రాణ హానీ ఉందంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సునీత(Sunitha), రామ్ వీరపనేని(Ram Veerapaneni)లు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఉమెన్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో నివాసం ఉంటున్నారు. అయితే తాను సినీ నిర్మాత కౌన్సిల్ సభ్యుడినని చెప్పి కేకే లక్ష్మణ్(KK Lakshman) అనే వ్యక్తి రామ్‌‌ ఫోన్‌కి మెసేజ్ చేశాడు.

రామ్‌(Ram Veerapaneni)ని వ్యక్తిగతంగా కలవాలని భావిస్తున్నట్టు మెసేజ్‌లో సదరు లక్ష్మణ్(Lakshman) వెల్లడించాడు. అలాగే వ్యాపార సంబంధిత విషయాల గురించి మాట్లాడేందుకు తన బృందాన్ని కలవాలని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియకపోవడంతో కలిసేందుకు రామ్ వీరపనేని అంగీకరించలేదు. అయితే సదరు వ్యక్తి అంతటితో ఆగలేదు. నిత్యం వ్యక్తిగతంగా కలవాలని తెలియజేస్తూ రామ్ వీరపనేని(Ram Veerapaneni)కి మెసేజ్‌లు పెడుతూ వస్తున్నాడు. దీంతో విసుగు చెందిన రామ్.. నంబర్‌ను బ్లాక్ చేశారు.

అయితే 2023 మార్చి 28న మరో కొత్త నంబరుతో లక్ష్మణ్ తన సందేశాలను పంపడం ప్రారంభించాడు. ఈ సారి ఏకంగా బెదిరింపులకు దిగాడు. దీంతో రామ్ వీరపనేని(Ram Veerapaneni).. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్‌ నుంచి ప్రాణహాని ఉందని.. అతనెవరో తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేకే లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Google News